Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ప్రథమ్ ఇన్ఫోటెక్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఎస్ఏపి- ఐటిసి వారి సహాయ సహకారంతో భద్రాచలం, భూర్గంపహడ్లో గల ఇరవై ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్యను ఉచితంగా అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ 20 ప్రభుత్వ పాఠశాల పిల్లలు కంప్యూటర్ ద్వారా చేసిన ప్రాజెక్ట్‌లను డిజిటల్ మేళా భద్రాచలం గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో సోమవారం ప్రదర్శించారు. ఈ డిజిటల్ మేళాను ఐటిడిఏ ఏపీవో జనరల్, ఆర్.సి.ఓ డేవిడ్ రాజు లాంఛనంగా ప్రారంభించి, మాట్లాడారు. పిల్లలకు కంప్యూటర్ విద్యను అందించటం అభినందనీయమన్నారు. ఐటీసీ ఎంఎస్కే మేనేజర్ జయప్రకాష్ పిల్లలతో మాట్లాడుతూ ఆధునిక డిజిటల్ రంగంలో కంప్యూటర్ విద్యా చాలా అవసరం, బాగా నేర్చుకోవాలని చెప్పారు. పిల్లలకి సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు, ఐటీసీఎమ్ఎస్కే ప్రాజెక్ట్ మేనేజర్ జయప్రకాష్, ప్రాజెక్ట్ అధికారి కృష్ణ కాశ్యప్, ప్రథమ్ ఇన్ఫోటెక్ ఫౌండేషన్ నిర్వహణ అధికారి లోకరాజు, ప్రోజెక్ట్ కోఆర్డినేటర్ నవీన్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ నీరజ, హెడ్ మాస్టర్ శ్రీనివాస్, ప్రధమ్ ఇన్ఫోటెక్ ఫౌండేషన్ టీమ్ అలీ, రాజు తదితరులు పాల్గొన్నారు.