Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తుదారులందరికీ డబుల్ ఇండ్లు మంజూరు చేయాలి
- సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా
నవతెలంగాణ-కొత్తగూడెం
వేసవి ఎండల తీవ్రత పరిగణలోకి తీసుకొని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక శేషగిరిభవన్లో జరిగిన కొత్తగూడెం పట్టణ సీపీఐ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోజు రోజుకు తాగునీటి సమస్య తీవ్రమవుతోందన్నారు. పైపులైన్లు, బోర్లు, మోటార్లు, మినీ నీటి పథకాలు పడకేస్తున్నాయని, మరమ్మతులు, నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పటికీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదన్నారు. అధికార యంత్రాంగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారని ఆరోపించారు. ఇండ్ల నిర్మాణం పూర్తికాన్నప్పటికీ సర్వేలు నిర్వహించడం ప్రజలను మభ్యపెట్టేందుకేనా అని ప్రశ్నించారు. స్వంత స్థలంఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.6 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి వై.శ్రీనివాసరెడ్డి, నాయకులు కందుల భాస్కర్, కె.రత్నకుమారి, మాతంగి లింగయ్య, పల్నాటి ప్రశాంత్, పి.సత్యనారాయణచారి, షాహీన్, లక్ష్మినారాయణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.