Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీ ఎస్.వీ రాఘవేందర్ రావు
నవతెలంగాణ-మణుగూరు
శ్రీ విజ్ఞాన్ స్కూల్లో ''సైన్స్ ఎక్సోపో'' వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం పాఠశాల కరస్పాండెంట్స్ సాంబశివరెడ్డి, సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ''సైన్స్ ఎక్సోపో''లో విద్యార్థులు సైన్స్‌కు సంబంధించిన వివిధ రకరకాల సైన్స్ చాట్స్, న్యూటెక్నాలజీ యంత్రాల ప్రయోగాలను, బ్లడ్ టెస్ట్ వివిధ రకాల ప్రయోగాలను తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మణుగూరు సబ్ డివిజన్ డీఎస్పీ ఎస్.వీ రాఘవేందర్ రావు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన అనేక ప్రయోగాలను ప్రదర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థుల చేత తన బ్లడ్ టెస్ట్ కూడా పరీక్షించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ...ఈసైన్స్ ఎక్సోపో వల్ల విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజ్ కుమార్, శ్రీవిద్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పుచ్చకాయల శంకర్, ప్రిన్సిపల్ ప్రజ్వల, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు శ్రీరామ్, రవి, సీతారాం, శశి, దుర్గాదేవి, సాజిదా, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.