Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
బంజారాల సంక్షేమానికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం శేషగిరి నగర్ ఏరియాలో సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాబోగ్ కార్యక్రమంలో పాల్గొని అగ్నిదేవతలకు పూజలు నిర్వహించి, మాట్లాడారు. 10 శాతం రిజర్వే షన్లతో సహా అన్నిట్లల్లో సీఎం కేసీఆర్ గిరిజనులకు అండగా నిలిచార న్నారు. బిఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.