Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3000 ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు
నవతెలంగాణ-పాల్వంచ
ఈ నెల 28వ తేదీన కొత్తగూడెం క్లబ్లో జరుగుతున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువ త సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ యువతకు పిలుపునిచ్చారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఉపాధి శిక్షణశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కొత్తగూడెం క్లబ్లో ఉదయం 9 గంటల నుండి నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. 8, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ, సీఏ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఐటీఐ (ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్, సివిల్, కార్పెంటర్, ప్లంబింగ్ చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా ఫారంతో పాటు విద్యార్హతల జిరాక్స్ పత్రాలను వెంట తెచ్చుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధి కల్పన అధికారి వేల్పుల విజేత, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.