Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనికి భద్రత కల్పించాల్సిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఉపాధి పని ప్రాంతంలో సంఘం సభ్యత్వం చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దారుణంగా ఉపాధి హామీ పనిని దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. పని లేకుండా చేయాలనే కుట్రతో భాగంగా మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేయాలని అధికారులు ఆదేశిస్తున్నారని ఆయన అన్నారు. అన్ని గంటలు ఎర్రటి ఎండల్లో పనిచేయలేకపోతున్నామని, ఉపాధి కార్మికులు వాపోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎస్.కె.అబీద, పద్మ, లక్ష్మి, లత, సీతమ్మ, విజయ, సంధ్య, ధనలక్ష్మి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.