Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిష్కార స్వభావాన్ని ప్రజావాణి పోర్టల్ లో అప్లోడ్ చేయాలి
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తుల పరిష్కరించకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాల్లో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలని, పరిష్కారం స్వభావాన్ని ప్రజావాణిలో పోస్టర్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. వచ్చే సోమవారం నాటికి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించని అధికారులకు షోకాస్ నోటీసు జారీ చేయాలని డీఆర్ఓకు సూచించారు. పరిష్కరించడానికి అవకాశం ఉన్నట్లయితే తక్షణం పరిష్కరించాలని అవకాశం లేనట్లయితే అదే విషయాన్ని దరఖాస్తుదారుడికి లిఖితపూర్వకంగా అందజేయాలని చెప్పారు. పెండింగ్‌లో ఉంచొద్దని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో పాల్వంచ పట్టణానికి చెందిన బానోతు పవిత్ర ఐడీఓసీ కార్యాలయంలో పారిశుధ్య పనులు గార్డెనింగ్ పనులు నిర్వాణకు అవకాశం కల్పించాలని, చేసిన దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ ఉపాధి అవకాశాలు కల్పించాలని, జిల్లా ఉపాధి కల్పనా అధికారికి సూచించారు. టి.శివకృష్ణ తదితరులు ములకలపల్లి మండలం జగన్నాధపురం, చౌటుగూడెం, గంగారం తదితర గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టు పనులను గ్రామసభలు నిర్వహించకుండానే తప్పుడు పద్ధతుల్లో పనులు చేపించడం జరుగుతుందని విచారణ నిర్వహించాలని కోరారు. దరఖాస్తు పరిశీలించిన కలెక్టర్ తగు చర్య నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫార్స్ చేశారు. ఆళ్లపల్లి మండలం పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన వి.నరసింహ రావు పెద్ద వెంకటాపురం గ్రామపంచాయతీలో రెండు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మొక్కలు గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోయడం జరుగుతుందని, ట్యాంకర్ ద్వారా మొక్కలను సమృద్ధిగా నీరు పెట్టలేకపోతున్నామని, విద్యుత్ నిరుద్యోగరం కల్పించాలని కోరారు. దీంతో తగు చర్యల తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. లక్ష్మీ దేవిపల్లి మండలం లాలూ తండ గ్రామానికి చెందిన బట్టులాలు తనకు టేకులపల్లి మండలం గొల్లపల్లి రెవిన్యూ పరిధిలో 36 గంటల భూమి ఉందని ఆ భూమి ధరణీలో చూపించడం లేదని, కావున విచారణ నిర్వహించి తన భూమిని ధరిని పోర్టర్లో నమోదు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని వాటితో పాటు రైతుబంధు, రైతు బీమా పథకాలు వర్తింపజేయాలని కలెక్టర్ కోరారు. దీంతో ధరణి కోఆర్డినేటర్ ఇండాస్ చేశారు. ఎండి యాకుబ్ పాషా జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కొత్తగూడెం పట్టణం ట్యూన్ బస్తిలోని ముస్లిం షాది ఖానాకు మరమ్మతు నిర్వహించాలని చేసిన దరఖాస్తుకు పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్‌కు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.