Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూల వ్యాపారం లాభదాయకం : ఏడీ
నవతెలంగాణ-అశ్వారావుపేట
పూల వ్యాపారం అయినా ప్రస్తుతం లాభదాయకం అయినదని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ అన్నారు. సోమవారం వ్యవసాయ కళాశాలలో, షెడ్యూల్డ్ కులాలు-ఉప ప్రణాళిక 22-23లో భాగంగా, ఐకార్ (ఐసీఏఆర్) సహకారంతో పూలు ఎండ పెట్టే పద్దతి, వివిధ ఉత్పత్తుల తయారీ పై శాస్త్రవేత్తలు ఐ.వి.ఎస్ రెడ్డి, నీలిమ ఆధ్వర్యంలో ఒక్క రోజు శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా సయ్యద్ అహ్మద్ హుస్సన్ పాల్గొన్నారు. ఇందులో అవేర్ వ్యవసాయ పాలిటెక్నిక్, వికేడీవిఎస్ కళాశాల విద్యార్థినీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండు పుష్పాలు ప్రాముఖ్యత, విదేశాలకు ఎగుమతి, రకరకాల ఉత్పత్తులు, ఉత్పత్తులు తయారు చేసే పద్ధతులు, మార్కెటింగ్ పై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినిలు స్వంతగా రకరకాల కళాకృతులు రూపొందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల శాస్త్రవేత్తలు వి.వెంకన్న, జి.గోపాలకృష్ణమూర్తి, మధుసూదన్ రెడ్డి, పావని, శిరీష, స్రవంతి, పాల్గొన్నారు.