Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యేకి వినతి
నవతెలంగాణ-చండ్రుగొండ
వర్కింగ్‌లో ఉన్న జర్నలిస్ట్ లందరికీ ఇండ్ల స్థలాలు, పక్కా ఇండ్లు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావును మండల వర్కింగ్ జర్నలిస్టులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ స్వయంగా జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ సమయంలో వర్కింగ్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ ప్రకారం ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. సమస్యను సానుకూలంగా స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యే, ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్టులు యస్కే జాఫర్, సోమనపల్లి వెంకటేశ్వర్లు, ఎస్డి నూర్ రబ్బాని, డి.లక్ష్మణ్, కంచర్ల కృష్ణ ప్రసాద్, రాందాసు, బండి శ్రీకాంత్, బి.వీరభద్రం, ఉత్పతల గణేష్, పూసం రాంబాబు, కే.దినేష్, బడికల శ్రావణ్ కుమార్, దయాకర్, వెంకటేశ్వర్లు, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.