Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
వైద్య విద్యార్ధిని ప్రీతి మృతికి పలు రాజకీయ, విద్యార్ధి, యువజన, జర్నలిస్టు సంఘాలు స్పందించాయి. వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరలని మౌనం పాటించారు. సోమవారం వివిధ జర్నలిస్టుల సంఘంల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ కారణంగా డాక్టర్ ధారావత్ ప్రీతి మృతి తీరనిలోటన్నారు.కొత్తగూడెంలోని బస్టాండ్ సెంటర్లో అమరవీరుల స్తూపం వద్ద ప్రీతికి ఘన నివాళి అర్పించారు. వారి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిటిడబ్య్లూజేఏ, టియూడబ్య్లూ (టిజేఎఫ్) టియూడబ్ల్యూ (ఐజేయూ) ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో భానోత్ వీరు, కల్లోజి శ్రీనివాస్, ఇమ్మంది ఉదరు కుమార్, పోలిశెట్టి రమేష్, వట్టి కొండ రవి, షఫీ, ఈశ్వర్, రమేష్, శంకర్, రాందాస్, అశోక్, చిరు, లక్ష్మణ్, హరి, కోటి, రాము, రామకృష్ణ, సర్వేష్, విభిన్న ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షులు గుండెపూడి సతీష్, బాబు, రెడ్డి, నాగేశ్వరరావు, కరుణాకర్, ఖాదర్ బాబా, తదితరులు పాల్గొన్నారు.
డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ : ప్రీతి మృతికి కారకులైన సైఫ్‌ను, ఇతరులు ఎవరు ఉన్న సమగ్ర విచారణ చేసి కఠి నంగా శిక్షించాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లిక్కి బాలరాజు, కాలంగి హరి కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశం, రాష్ట్రంలో, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి అనడానికి ఈ ఘటన నిదర్శనం అన్నారు. ప్రీతి కుటుంబానికి జిల్లా కమిటీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఐద్వా ఖండన : పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడగా 5 రోజులు ఆసుపత్రిలో చికిత్సపొంది సోమవారం తుది శ్వాస విడిచింది. ప్రీతి ఆత్మహత్యకు చేసుకొని చనిపోవడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఐద్వా కొత్తగూడెం పట్టణ కమిటీ డిమాండ్ చసింది.
ఎమ్మెల్యే వనమా సంతాపం : ప్రీతి మృతికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తీవ్ర సంతాపం, సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి వనమా ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే జలగం సంతాపం : మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు సంతాపం తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నుండి ప్రకటన విడుదల చేశారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని జలగం తెలిపారు.
ఇల్లందు : కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతికి కారకులైన సైఫ్‌ను ఇంకా ఇతరులు ఎవరు ఉన్న సమగ్ర విచారణ చేసి కఠినంగా శిక్షించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లిక్కి బాలరాజు, కాలంగి హరికృష్ణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కేంద్రం, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి అనడానికి ఈ ఘటన నిదర్శనం అన్నారు. ప్రీతి కుటుంబానికి జిల్లా కమిటీ నుండి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు.
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో...
ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ చేసిన ర్యాగింగ్ భూతానికి బలై పోయింది. అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నందు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి జె.గణేష్ మాట్లాడుతూ.. ఈవ్ టీజింగ్‌లను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి ప్రభాకర్, పట్టణ కార్యదర్శి కుమార్, సిద్దార్థ, ప్రశాంత్, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : వైద్య విద్యార్థి ప్రీతి, సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసిందని, 5 రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచిందని, ఆమె మృతికి కారణమైన నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఐద్వా కార్యదర్శి డి.సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీతామహాలక్ష్మి మాట్లాడు తూ....డాక్టర్ ప్రీతి మరణం పట్ల ఆమె కుటుంబ సభ్యులకు ఐద్వాగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంత, ఎస్.సీత, పి.దేవి, పి.ఇంద్రజ, డి.నాగలక్ష్మి, డి.సంధ్య, టి.విజయలక్ష్మి,ఉమా,సోమాలు, ఎస్.రాధ తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి మరణానికి కారకులైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని టీపీటీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు కే.జోగారావు, బి.రవిలు డిమాండ్ చేశారు. సోమవారం లక్ష్మీనగరం గిరిజన బాలికల వసతి గృహంలో నిరసన తెలిపారు. ప్రీతి ఆత్మ శాంతిచాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజే శారు. నిరసన కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు ఎం.మంజుల, ఉపాధ్యా యులు, జయ, సుజాత, నాగేశ్వరరావు వార్డెన్ శాలిని తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు : పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి కారకుడైన సైఫ్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి భూక్యా శంకర్ నాయక్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడారు.
పాల్వంచ : ధారావత్ ప్రీతీ నాయక్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నివాళులు అర్పిస్తూ బంజారా నాయకుల ఆధ్వర్యంలో పట్టణం లోని అంబేద్కర్ సెంటర్లో సోమవారం కొవ్వొత్తులు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు భూక్య చందు నాయక్, అజ్వేరా బాబు నాయక్, కుర్ర రాములు, సర్పంచ్‌లు విజరు, రవీందర్, శ్రీను, బద్రు, రాందాస్ పాల్గొన్నారు.
జూలూరుపాడు : మెడికల్ విద్యార్థిని డాక్టర్ ప్రీతి, ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత కుటుంబ సభ్యుల కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉన్నత చదువులు చదువుతున్నటువంటి మెడికల్ విద్యార్థిని ప్రీతి, ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత రాగింగ్, సీనియర్ వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారని వారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బోడ అభిమిత్ర, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.