Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ యూనియన్ డైవర్స్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కృతజ్ఞతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
హైదరాబాద్ సింగరేణి భవన్లో ప్రైవేట్ కన్వినేన్స్ డ్రైవర్లకు కేటాయించిన విశ్రాంతి రూమ్లో పడకలు లేక ఇబ్బందులు పడుతున్నారని రెండు నెలల క్రితం ఇదే విషయమై అడ్మిని స్ట్రేటివ్ అఫీసర్ భాస్కర్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన అధికారులు డ్రైవర్ల సౌకర్యార్థం పడకలను మంజూరు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్యామ్ కుమార్ మాట్లాడుతూ అడిగిన బెడ్లను సాధించుకోవడంతో పాటు సిఐటియు యూనియన్ ద్వారా స్కిల్డ్ పేమెంట్, ఔట్ స్టేషన్ డిఏ, సీఎం పిఎఫ్, ఏరియర్స్ వంటి పలు రకాల డిమాండ్లను సాధించుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని డిమాండ్లపై పోరాడుతూ డ్రైవర్ల హక్కుల కోసం పోరాడుతానని ధన్యవాదాలు తెలిపారు.