Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఆదివారం కల్లూరులో జాతీయ స్థాయిలో జరిగిన కరాటీ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు సోమవారం మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు కరాటి నేర్చుకోవడం ద్వారా స్వరక్షణ పొందవచ్చు అని, బాలికలు సైబర్ నేరగాళ్ల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా బాలికలు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చూసించారు. విద్యార్థులకు కరాటి శిక్షణ ఇచ్చి ఎన్నో బహుమతులు సాధించడానికి కృషి చేసిన కరాటి మాస్టర్ పవన్ కృష్ణని అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ షాహీన్, కస్తూర్బా గాంధీ విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ పి.కవిత, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.