Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య
నవతెలంగాణ-బూర్గంపాడు
దేశాన్ని పెట్టుబడి దారుల్ని నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులుగా మన మీద ఉన్నదని, అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట రామయ్య పిలుపునిచ్చారు. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజరలో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు ముక్తి సత్యం అధ్యక్షతన జరిగింది. ఈ జనరల్ కౌన్సిల్లో ముక్తి సత్యం జెండా ఆవిష్కరణ చేయగా, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమర్ సంతాప తీర్మానం అమరవీరులకు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సమావేశంలో వేములపల్లి వెంకట రామయ్య మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయ రంగం ప్రమాద అంచుకు చేరుకుందని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎనిమిదిన్నర సంవత్సరాలుగా వ్యవసాయ రంగాన్ని నీరుగారు స్తుందని ఆయన విమర్శించారు. రాత్రిం బవళ్లు కష్టపడి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితిలో కూడా లేవని ఆయన అన్నారు. అంతేకాకుండా దశాబ్దాలుగా ఆదివాసులు సాగుచేసు కుంటున్న పోడు భూములకు పట్టాలివ్వకుండా ఆదివాసీలను అడవుల నుంచి వెళ్ళగొట్టాలని పాలక ప్రభుత్వాలు చూస్తున్నాయని ఆయన ఆరోపించారు.అదే విధంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడారు. ఈ జనరల్ కౌన్సిల్లో జిల్లా ఉపాధ్యక్షులు తుపాకుల నాగేశ్వరరావు, జిల్లా కోశాధికారి జక్కుల రాంబాబు, నాయకులు కుంజాకృష్ణ, సుర్ణపాక నాగేశ్వరరావు, కందగట్ల సురేందర్, బండ్ల వెంకటేశ్వర్లు, బట్టు ప్రసాదు, ఎట్టి నరసింహారావు, రామచంద్రు, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు గౌని నాగేశ్వరావు, పీఓడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు వీర మల్ల ఉమా, నాయకులు మల్లికార్జు నరావు, వైఎస్ రెడ్డి, వీరమళ్ళ మల్లయ్య, కుంజా భుద్రా తదితరులు పాల్గొన్నారు.