Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా దినోత్సవానికి ఆహ్వానించిన దిశా
నవతెలంగాణ-పాల్వంచ
మహిళా హక్కుల కాపాడడం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం పురస్కరించుకొని మార్చి 4వ తారీకు కొత్తగూడెంలో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే మహిళా దినోత్సవం సంబరాలకు ఎమ్మెల్యే వనమా రావాలని దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ జిల్లా అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణ టీం ఆహ్వానించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా వస్తానని, మా ఆశీస్సులు అండదండలు మీకు మా సహకారం ఎప్పటికీ ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. మీకు ఎటువంటి సహాయం సహకారాలు కావాలన్నా మీకు తోడుగా మీ ఎమ్మెల్యే ఉంటాడని మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మేము కూడా పాల్గొంటామని వారు అన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు మాట్లాడుతూ మహిళలు అన్ని విధాలుగా వంచింపబడుతున్నారని, మహిళా హక్కుల కోసం తక్షణమే స్పందించి వారికి అండగా నిలుస్తామని న్యాయం జరిగే వరకూ బాధితుల పక్షాన పోరాడుతామని వారన్నారు. రాబోతున్న మహిళ దినోత్సవం దిశా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబోతున్నామని ముందుగా మహిళలందరూ ఒకటిగా ఉంటూ ఒక దగ్గర చేరి ఆటల పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుందని గెలిచిన వారికి మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ బహుమతులు కూడా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దిశా జిల్లా అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణ, జిల్లా ఉపాధ్యక్షురాలు సారపాక సుజాత, జిల్లా ఉపాధ్యక్షురాలు భద్రాచలం లక్ష్మి, అశ్వాపురం స్వర్ణ, స్వరుప, సుజాత, హేమలత, దిశా జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ సారపాక ఉమా, స్వర్ణలత, శశి, రమణ తదితరులు పాల్గొన్నారు.