Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఎనర్జీ డిపార్ట్మెంట్ సునీల్ శర్మ కొత్తగూడెంలోని 37 మెగా వాట్స్ పవర్ ప్లాంట్‌ను సోమవారం సందర్శించారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్ ఎన్‌వికే శ్రీనివాస్, డైరెక్టర్ ఈ అండ్ ఎం.సత్యనారాయణ, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ పాల్గొన్నారు. సునీల్ శర్మ సార్ సింగరేణిలోని అన్ని సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ గురించి వాటి పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. జీకే ఓపెన్‌కాస్టు వ్యూ పాయింట్‌ను అక్కడ ఉన్నటువంటి ఎకో పార్కును దర్శించారు. తదుపరి పీవీకే 5 అండర్ గ్రౌండ్ మైన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం రమేష్, జిఎం సోలార్ జానకి రాము, జిఎం ఎస్టేట్స్ సుభాని, ఏజీఎం ఈ అండ్ ఎం రఘురామిరెడ్డి, డీజీఎం పర్సనల్ సామ్యూల్ సుధాకర్, ఏరియా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఘన స్వాగతం : సునీల్ శర్మ సింగరేణి ప్రాంతాన్ని సందర్శించారు. ఆదివారం రాత్రి ఆయన కొత్తగూడెం చెరుకున్నారు. సింగరేణి ఎల్లందు గెస్టు హౌస్‌లో ఆయనకు సింగరేణి సంస్థ డైరెక్టర్ (పా) ఎన్.బలరామ్ పుష్పగుచ్చం అందజేసి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఓపి ఎన్‌వికే శ్రీనివాస్‌చ జిఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ ఆర్సి కె.బసవయ్య, జిఎం సిపిపి సిహెచ్.నర్సింహారావు, సీనియర్ పిఓ సుశీల్ కుమార్ తదీతరులు పాల్గొన్నారు.