Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
మండలంలోని తిప్పనపల్లి పంచాయతీ అభివృద్ధి బాధ్యత తనదేనని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సోమవారం 15 లక్షల విలువ చేసే సీసీ రోడ్లను ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామస్తుల కోరిక మేరకు మరో రూ.10 లక్షలు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులను అక్కడికక్కడే ప్రకటించారు. ఇప్పటివరకు గ్రామానికి సుమారు రూ.50 లక్షల నిధులను కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, సర్పంచ్ పార్వతి, ఎంపీటీసీ లంక విజయలక్ష్మి, ఉపసర్పంచ్ ధరావత్ రామారావు, సీనియర్ నాయకులు రాములు, వెంకటేశ్వర్లు, గుంపెన సొసైటీ చైర్మన్ సుధాకర్ రావు, శివ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.