Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ధంతి సభలో నేతలు ఉద్ఘటన
నవతెలంగాణ-భద్రాచలం
నిస్వార్ధ ప్రజా సేవకుడు కామ్రేడ్ కొండలరావు అని, ఆయన స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు చిటికెన ముసలయ్యలు అన్నారు. పార్టీ మాజీ పట్టణ కమిటీ సభ్యులు, రజక వృత్తిదారుల ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు అమరజీవి కామ్రేడ్ ఐతంరాజు కొండలరావు 5వ వర్ధంతి సభ గుంటిపల్లి లక్ష్మీకాంత్ అధ్యక్షతన ఎనిమిదవ వార్డు మనుబోతుల చెరువు కాలనీలో జరిగింది. ముందుగా కొండలరావు స్తూపం వద్ద పార్టీ పతాకాన్ని రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. కొండలరావు చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బి.నర్సారెడ్డి, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ముసలయ్యలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ కామ్రేడ్ కొండలరావు పేదలకు కూడు, గుడ్డ, నీడ అందుబాటులోకి తేవాలని పార్టీ జెండా పట్టుకుని ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేశారని అన్నారు. రజక వృత్తిదారుల సంఘం నాయకునిగా రజకుల సమస్యలపై జిల్లా వ్యాప్తంగా పనిచేశారని అన్నారు. నేడు దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పేదల సమస్యలు గాలికి వదిలి సంపన్నులకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. కామ్రేడ్ కొండలరావు స్ఫూర్తితో పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, యలమంచి వంశీకృష్ణ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, నాదెళ్ల లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు ఎన్.నాగరాజు, బి.కుసుమ, డి.సీతాలక్ష్మి, కుంజా శ్రీనివాస్, కోరాడ శ్రీనివాస్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు గౌతమి, డాక్టర్ సందీప్, మానస రాము, శాఖా కార్యదర్శులు అన్నం లక్ష్మీనారాయణ, డి.రామకృష్ణ, కుటుంబ సభ్యులు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.