Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్న ఉద్యోగాలైన నిలదొక్కుకొని స్థిరపడాలి
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనిచేస్తుందని, నిరుద్యోగ యువకులు చిన్న ఉద్యోగాలైన నిలదొక్కుకుని స్థిరపడాలి, తల్లి, దండ్రుల కలలు సాకారం చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం జిల్లా ఉపాధికల్పనశాఖ ఆద్వర్యంలో కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలను ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడారు. జిల్లాలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం నిరుద్యోగ యువతకు అందివచ్చిన అవకాశమని తెలిపారు. చిన్న అవకాశం వచ్చినా దాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని, వారికి ఆసరాగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి వేల్పుల విజేత, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, చుంచుపల్లి ఎంపీపీ బాదవత్ శాంతి, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఉపాధి కల్పన శాఖ అధికారులు, వివిధ కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు.