Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ డాక్టర్ వినీత్.జి
నవతెలంగాణ-కొత్తగూడెం
పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ విభాగం పాత్ర చాలా కీలకమని ఎస్పీ వినీత్.జి అన్నారు మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రాపురంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్న జిల్లా సాయుధ దళ విభాగంలో జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల విధులు నిర్వర్తించే ఏఆర్ అధికారులు, సిబ్బందికి గత 15 రోజులుగా మొబిలైజేషన్లో భాగంగా వారి విధులలో మరలా తిరిగి శిక్షణను పొందడం జరిగింది. ముగింపు కార్యక్రమం అయిన డీ-మొబి లైజేషన్లో ఎస్పీ పాల్గొన్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజరు బాబు ఆధ్వర్యంలో ప్రణాళిక ప్రకారం ఈ డీ-మొబి లైజేషన్ కార్యక్రమం జరిగింది. ముందుగా ఎస్పీ వినీత్ జిల్లా సాయుధ బలగాల విభాగం తరపున పరేడ్ కమాండర్ ఆర్ఐ దామోదర్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం 04 ప్లాటున్స్ ద్వారా జరిగిన మొబిలైజేషన్ పరేడ్‌ను ఎస్పీ వీక్షించారు. తరువాత జిల్లా డాగ్ స్క్వాడ్ నందు పని చేస్తున్న జాగిలాల ప్రతిభను ప్రదర్శించారు. స్క్వాడ్ డ్రిల్, లాఠీ డ్రిల్, మాబ్ ఆపరేషన్ తదితర అంశాల పై ఏఆర్ సిబ్బంది తమ విధుల తీరును వ్యక్తపరుస్తూ గత 15 రోజులుగా వారు తీసుకున్న శిక్షణను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఏఆర్ విభాగం పాత్ర చాలా కీలకమని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. నిరంతరం ప్రజాసేవలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పోలీస్ శాఖలో విధులను నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా సాయుధ విభాగంలోని పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరలో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీఇచ్చారు.