Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురి పై బైండోవర్ కేసులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా ఎక్సైజ్ అధికారులు దాడులు చేపడుతున్నారు. మంగళవారం ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ టీమ్‌తో పాటు భద్రాచలం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సుజ్ఞ్నాపురం, ముకనాపల్లి గ్రామాలలో ఉమ్మడి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో సుజ్ఞ్నాపురం గ్రామంలో నిల్వ ఉంచిన 400 లీటర్ల బెల్లం పానకాలను ద్వంసం చేశారు. ముకనాపల్లి గ్రామంలో నాటుసారా అమ్ముతున్న ఓ వ్యక్తి వద్ద నుండి 10 లీటర్ల నాటు సారాయి స్వాదీనం చేసుకుని అతని పై కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను తహశీల్దార్ కార్యాలయంకు తీసుకు వెళ్లి వారి పై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఈ దాడులలో ఎన్ఫో ర్స్మెంట్ ఏఇఎస్ తిరుపతిరావు, సిఐ ముబషీర్, డిటిఎఫ్ ఏఇఎస్ కరణ్‌చంద్, సిఐ రాజారెడ్డి, ఎస్హెచ్ఓ రహీము న్నీషా బేగం, ఎస్ఐ రాజేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.