Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ డే
నవతెలంగాణ-మణుగూరు
ప్రపంచ సంక్షేమం కోసం గ్లోబల్ సైన్స్ అనే థీమ్‌తో సైన్స్‌డే నిర్వహిస్తున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ సాయికృష్ణ ప్రసాద్ అన్నారు. మంగళవారం జాతీయవిజ్ఞాన దినోత్సవం సందర్బంగా గుట్టమల్లారంలో గల శ్రీచైతన్య పాఠశాలలో సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు రకరకాల ప్రాజెక్టులను తయారుచేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంఈఓ వీరస్వామి, గైకాలజిస్ట్ సంఘమిత్ర, శివకుమార్ పిహెచ్సి హాజరయ్యారు. ప్రాజెక్ట్‌లని చూసి విద్యార్థులను ప్రశంసించారు. అనంతరం శ్రీ చైతన్య స్కూల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు రకరకాల ప్రాజెక్టులను ప్రదర్శించారని అన్నారు. దీనికి సహకరించిన ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎం.నరేష్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.