Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని సారపాకలో గల బ్రిలియంట్ విద్యాసంస్థలలో జాతీయ సైన్స్ డే సందర్భంగా మంగళవారం విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమం అందరినీ అలరించాయి. విద్యాసంస్థల చైర్మెన్ బీఎన్ఆర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల తయారు చేయబడిన సైన్స్ ప్రాజెక్టులను ఉపాధ్యాయ, అధ్యాపక బృందంతో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చైర్మన్ బీఎన్ఆర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత ఎంతో ముఖ్యమని, దీని వల్లే దేశంలో నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు చాలా బాగున్నాయని, భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థితిలో చేరి శాస్త్ర సాంకేతిక రంగంలో దేశాన్ని మంచి స్థానంలో ఉంచుతారని ఆయన పేర్కొన్నారు. పాఠశాల 10వ తరగతి విద్యార్థులు సైన్స్ విభాగం ఉపాధ్యాయులు నరేష్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వర్ణ కుమారి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
మహాత్మ జ్యోతిరావు ఫూలే
గురుకుల పాఠశాలో
మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంగళవారం సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ టి.సునీత ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన 116 రకాల మోడల్స్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులు మోరంపల్లి బంజర్ ప్రధానోపాధ్యాయులు కె.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ టి.సునీత, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సాంఘీల సంక్షేమ గురుకుల పాఠశాలలో
మన ఆచారాలు, ఆలోచనలు, జీవన విధానాలు అన్నీ శాస్త్ర ప్రకారం మార్చుకోవడమే శాస్త్రీయ దృక్పధమని, దానికి ప్రమాణికమే సైన్స్ అని, అదే సత్యమని జనవిజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు మండవ సుబ్బారావు, ఆల్ ఇండియ లాయర్ల సంఘం అధ్యక్షులు రమేశ్ కుమార మక్కాడ్ అన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ రాజ్య లక్ష్మి అధ్యక్షతన సైన్స్ సెమినార్ నిర్వహించారు. నోబెల్ గ్రహీత సర్.సి.వి.రామన్ చిత్ర పటానికి పూల మాలలతో నివాళులర్పించారు. జె.వి.వి పతాక ఆవిష్కరణ అనంతరం విద్యార్థులచే ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కస్తూరి మాట్లాడారు. విద్యార్థులకు డ్రాయింగ్, డిబేట్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్బంగా మ్యాజిక్ షో ద్వారా మంత్రాలకు చింతకాయలు రాలవని నిరూపించారు. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు, బర్ల తిరుపతయ్య, కామేశ్వరరావు, వీరా స్వామి, పాఠశాల ఉపాధ్యాయినీలు శిరీష, జీనత్, సుధా, వినోద్, ఆశాలత, రాము, సారయ్య, బి.రాజ్యలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.