Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హార్వెస్ట్ విద్యాసంస్థల్లో
ఖమ్మం : భారత భౌతిక శాస్త్ర పితామహుడు, రామన్ ఎఫెక్ట్ సష్టికర్త, భౌతిక శాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాత బిరుదు 'సర్' అవార్డ్ గ్రహీత 'సర్.సి.వి.రామన్ జన్మదినాన్ని పురస్కరించుకుని, యావత్ భారతదేశం నిర్వహించుకుంటున్న 'జాతీయ సైన్స్ దినోత్సవ' వేడుకలు తమ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించుకున్నట్లు హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపల్ ఆర్.పార్వతిరెడ్డి తెలిపారు. మంగళవారం ఖమ్మంలోని పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మారుతున్న ప్రపంచ మనుగడలో సైన్స్ తెచ్చిన విభిన్న మార్పులు, టెక్నాలజీ ఉపయోగాలతోపాటు, సాంకేతికతను వ్యర్థంగా వాడుకునే క్రమంలో ఎదురయ్యే విపరీత పరిణామాలు విద్యార్థినీ, విద్యార్థులు తమ లఘు నాటికల ద్వారా వివరించి, ప్రదర్శించి చూపరులను ఆకట్టుకునేలా చేశారు. అనంతరం విద్యాసంస్థల్లో క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
'నిర్మల్ హృదరు ఉన్నత పాఠశాలలో నేషనల్ సైన్స్ డే
ఖమ్మం : నగరంలోని నిర్మల్ హృదరు ఉన్నత పాఠశాలలో నేషనల్ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో ఎటువంటి ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామో అలాగే ఎటువంటి ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవుతమో, వేసవిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఇచ్చి పుచ్చుకోవటం వాళ్ళ కలిగే లాభాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వి.సుధాకర్‌రెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయిని ఏ.పద్మజ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని వి.శ్రావణి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.
రెజొనెన్స్ ఇంజీనియస్-2023 వేడుకలు
ఖమ్మం : నగరంలో శ్రీనగర్ కాలనీలో రెజొనెన్స్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఇంజీనియస్-2023 కార్యక్రమానికి డాక్టర్ డి.కృష్ణసుమంత్, పాఠశాల డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు, కొండా కృష్ణవేణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ సుమంత్ మాట్లా డుతూ రెజొనెన్స్ స్కూల్ శ్రీనగర్ విద్యార్థులకు విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలకు గొప్ప వేదికను అందించిందని, విద్యార్థులంతా శాస్త్రీయమైన విజ్ఞానాన్ని పొందుతూ బావిభారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు. స్కూల్ డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు, కృష్ణవేణి మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు ఆలోచింపజేస్తూ ప్రయోగాత్మకంగా రుజువు చేయుటకు రెజొనెన్స్ స్కూల్ శ్రీనగర్ ప్రోత్సాహన్ని అందిస్తుందని తెలిపారు. అనంతరం ప్రముఖ వైద్యులు డి.కృష్ణ్ణసుమంత్ చేతుల మీదుగా విద్యార్థులకు నేషనల్ సైన్స్ డే అవార్డుల అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం.ప్రసన్నరావు, ఉపాధ్యాయులు, ఉపాధ్యేయేతర సిబ్బంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
'కవిత మెమోరియల్'లో '' నేషనల్ సైన్స్ డే సంబరాలు
ఖమ్మం : నగరంలోని కవిత మెమోరియల్ డిగ్రీ పీజీ కళాశాలలో మంగళవారం ''నేషనల్ సైన్స్ డే 2023 సంబరాలు ఘనంగా నిర్వహించారు. తొలుత కవిత మెమోరియల్ డిగ్రీ పీజీ కళాశాలో ప్రొఫెసర్ వెంకట్రామిరెడ్డి సర్ సివి. రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ డాక్టర్ పద్మజ, డాక్టర్ మోహన్‌బాబు, డాక్టర్ లలిత మాట్లాడారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని విజయ వంతగా నిర్వహించిన అధ్యాపకులను, విద్యార్థులను కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ కోట అప్పిరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి రమణరావు, వివిధ డిపార్ట్మెంట్ హెవోడిలు ఎస్.గీత, రంగారావు, పి. పద్మావతి, గురవయ్య, అజరు కుమార్, బి.మురళీకృష్ణ, బి.కల్పనా, ఆంజనేయులు పాల్గొన్నారు.
మోంట్‌ఫోర్ట్ హైస్కూల్లో జాతీయ సైన్స్ డే
ఖమ్మంకార్పొరేషన్ : జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా మోంట్ ఫోర్ట్ హైస్కూల్ లో 1976 పూర్వ విద్యార్థి చిగురుపాటి సత్య ప్రకాష్ జారిని వారి అమ్మ అమ్మాజీగారి భాషా జాపకార్థం 2లక్షల సైన్స్ పరికరాలను సైన్స్ ఆనాటి టీచర్‌కి కీ.శే. బి.ఎస్.జె సుందర్ రావు సైన్స్ ల్యాబ్ ను జిల్లా విద్యాశాఖా అధికారి ఈ.సోమశేఖరశర్మ చేతుల మీద ప్రారంభించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఆర్జెసి కృష్ణ ప్రసంగిస్తూ 1976 బ్యాచ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ రామకృష్ణ విద్యాలయంలో సైన్స్ ఎక్స్పో
ఖమ్మంకార్పొరేషన్ : ఖమ్మం నగరంలోని స్థానిక గుట్టలబజార్లో శ్రీ రామకృష్ణా విద్యాలయంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒకటవ తరగతి పిల్లలు సైతం చాలా ఉత్సాహంగా పాల్గొని, వారు ఎంచుకున్న ప్రాజెక్టులను వచ్చిన అతిథులకు, పేరెంట్స్‌కి చక్కగా వివరించారు. ఇటువంటి కార్యక్రమాలు జరపటం వల్ల పిల్లలలో ఆలోచనా శక్తి, అలాగే ఆవిష్కరణల మీద ఆసక్తి పెంపొందుతాయని పాఠశాల అధ్యక్షులు శ్రీ రక్ష హాస్పిటల్స్ ఎమ్‌డి డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు అన్నారు. పిల్లలు ఎలాంటి బెరుకు లేకుండా ఎంతో ఓపికతో వినయ విధేయతలతో వివరించారని అతిధిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ మెంబర్ విశ్వేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు సంతోష గౌతం, అధ్యాపక, అధ్యాపకేతర, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సైన్స్ దినోత్సవం
ఎర్రుపాలెం : జాతీయసైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులు ప్రయోగాత్మక మైన ఆలోచన విధానాన్ని శాస్త్ర సాంకేతిక రంగాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి పరిశీలించారు. విద్యార్థునులకు పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు అంత రాయం ఏర్పడితే పిల్లల చదువులకు ఇబ్బంది కలుగకూడదనే సదుద్దేశంతో పేరెంట్స్, పేరెంట్స్ కమిటీ సభ్యులు కలిసి 33,500 రూపాయల విలువ కలిగిన ఇన్వర్టర్ను వితరణ చేశారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ పొట్టపింజర చిట్టిబాబు, జనరల్ సెక్రటరీ కోట లోకేశ్వర రావు, వైస్ చైర్మన్ గుడేటి బాబురావు, జాయింట్ సెక్రటరీ మోదుగు సుధాకర్, కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, ముత్యాలరావు, జ్యోతి, రోజా, దేవమణి, కోట రవికుమార్ ప్రిన్సిపాల్ పద్మావతి, ఉపాధ్యాయలు, సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
'న్యూ లిటిల్ ఫ్లవర్'లో జాతీయ సైన్స్ దినోత్సవం
వైరా : న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో సర్ సి.వి రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవం మరియు విద్యార్థులు తయారు చేసిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరస్పాండెంట్ డా. పి.భుమేష్రావు, డైరెక్టర్స్ కుర్రా సుమన్ మాట్లాడుతూ అందరూ నూతన ఆవిష్కరణల దిశగా ఆలోచిం చాలన్నారు. ఆర్ట్ మరియు క్రాఫ్ట్ అనేవి విద్యార్థులలో దాగిఉన్న సృజనాత్మక నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పి.రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన ఆర్ట్ మరియు క్రాఫ్ట్ మరియు సైన్స్ కు సంబంధించిన ప్రతి ఆవిష్కరణ నూతన ఆలోచనను కల్గించే విధంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ పి.భువనప్రసాద్, ప్రిన్సిపాల్ షాజీ మాథ్యూ, ఎ.ఓ నరసింహారావు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
గీతాంజలిలో సైన్స్ దినోత్సవం వేడుకలు
ఖమ్మం కార్పొరేషన్ : ఖమ్మం నగరంలోని శ్రీనివాస్‌నగర్‌లో గీతాంజలి పాఠశాలలో సైన్స్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్ ఫోను ప్రముఖ కవి మువ్వా శ్రీనివాసరావుతో ఖమ్మం జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ బొగ్గవరపు రామచంద్రరావు కలిసి ప్రారంభించారు. ఈ సైన్స్ ఎక్స్ఫోలో దాదాపు 200 పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారు. కార్యక్రమంలో గీతాంజలి పాఠశాల కరస్పాండెంట్ టి.వి అప్పారావు, పాఠశాల డైరెక్టర్లు టి.పద్మ, టి.అరుణ్, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
త్రివేణి పాఠశాలలో వార్షికోత్సవ సంబరాలు
ఖమ్మం:ఖమ్మంలో త్రివేణి పాఠశాలలో వార్షికోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు కూరపాటి ప్రదీప్‌కుమార్, కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, త్రివేణి పాఠశాల సిఆర్ఓ కాట్రగడ్డ మురళీకృష్ణలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో చదువుతోపాటు అన్ని రంగాలను అభివృద్ధి చేయాలని వారిలో ఉండే నైపుణ్యాలను వెలికితీయాలన్నారు. త్రివేణి, కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ త్రివేణి విద్యాసంస్థలు ఎల్లప్పుడూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాయని అన్నారు. త్రివేణి పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ త్రివేణి పాఠశాలలో పుస్తకాల విజ్ఞానానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో శారీరక మానసిక ఎదుగుదలకు అవసరమైన అంశాలు నిర్వహించడంలో అంతే ప్రాధాన్యత వహిస్తామని అన్నారు. ప్రిన్సిపాల్ పి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ త్రివేణి విద్యాసంస్థల యాజమాన్యం ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన్ని వహిస్తుందని అన్నారు. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీదేవి మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో సాధించిన విజయాలు ప్రగతిని వివరించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన జానపద, సాంప్రదాయ నత్యాలు సాంస్కతిక కార్యక్రమాలు కరాటే విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
'సర్వజ్ఞ'లో శ్రీకార్ ది సైన్స్ ఎక్స్పో-2023 వేడుకలు
ఖమ్మం : నగరంలోని విడిఓస్ కాలనీలో గల సర్వజ్ఞ పాఠశాలలో మంగళవారం సర్వజ్ఞ శ్రీకార్ ది సైన్స్ ఎక్స్ పో-2023ను నిర్వహించారు. తొలుత పాఠశాల డైరెక్టర్ ఆర్.వి. నాగేంద్రకుమార్ సివి.రామన్ చిత్రపటానికి పూలమాల వేసి ఎక్స్పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి సైదులు మాట్లాడుతూ దైనందిన అవసరాలను సులువగా తీర్చే లైవ్ ప్రాజెక్టు సమాజా ఉన్నతికి దోహదపడతాయని తెలిపారు. అదేవిధంగా విద్యార్ధులలో నిబిడీకృతమై ఉన్న మేదస్సును వెలికితీయడమే సైన్స్‌కు ఉన్న ప్రాముఖ్యమన్నారు. విద్యార్థులకు శాస్త్రసాంకేతిక విషయాలపై అనురక్తిని కలిగించి, స్పూర్తి -నింపేందుకు శ్రీకార్ వంటి సైన్స్ ఎక్స్‌పోలు ఉపకరిస్తాయని, ఆ విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యం అభినందనీయులన్నారు. విద్యార్ధులు రూపొందించిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించడమేగాక వారికి పలు ప్రశ్నలు సంధించి జవాబులు రాబట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ నీలిమ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పరిపాలన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణప్రసాద్ మెమోరియల్‌లో...
ఖమ్మం : మారుతున్న కాలానికనుగుణంగా విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని కృష్ణ ప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాల చైర్పర్సన్ హృదరు మీనాన్ అన్నారు. మంగళవారం కృష్ణప్రసాద్ మెమోరియల్ పాఠశాలలో జరిగిన సైన్స్ ఫేర్ దినోత్సవంను హృదయ మీనాన్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డిఎస్. రాజు, శేషగిరిరావు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, సాజిద్, మేరీమేడమ్, విద్యార్థినీ, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.