Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-బూర్గంపాడు
సీపీఐ(ఎం) జిల్లా నాయకులు, అమరజీవి కామ్రేడ్ బండారు వెంకటేశ్వర్లు ఆశయాల కోసం శక్తి వంచన లేకుండా పనిచేయాలని జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. మంగళవారం బండారు వెంకటేశ్వర్లు ద్వితీయ వర్ధంతి సభ మండల పరిధిలోని నకిరి పేట గ్రామంలో బండారు స్థూపం వద్ద నిర్వహించారు. స్థూపానికి పూలమాల వేసి కనకయ్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండారు వెంకటేశ్వర్లు నాయకత్వంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు, ప్రజల పక్షాన నడిచాయని ఆయన అన్నారు. అనేక భూ పోరాటాలలో ఆయన పాత్ర క్రియాశీలకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి వాటి పరిష్కారానికి మార్గం చూపినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యులు పాండవుల రామనాథం, గుంటక కృష్ణ, రాయల వెంకటేశ్వర్లు, శాఖ కార్యదర్శులు నర్సింగ్ లింగ స్వామి, పాండవుల ప్రభాకర్, బుర్ర వెంకన్న, కృష్ణ చారి, జంపన్న తదితరులు పాల్గొన్నారు.