Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు దశాబ్దాలుగా రైతులను
- జాగిరిదార్ వారసుల పేరుతో వేధించడం సరికాదు
- తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ-ఖమ్మం
కొణిజర్ల మండలం సింగరాయపాలెం రెవెన్యూ పరిధిలోని సాగు భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని గ్రామ రైతులు ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ 1959 సంవత్సరంలోనే రైతులు జాగిరిదార్ నుంచి భూములు కొనుగోలు చేసి సాగు దారులుగా ప్రభుత్వం రెవెన్యూ రికార్డులలో ఉన్నారని అన్నారు. 1974 సీలింగ్ యాక్ట్‌లో రైతులకు చెందిన సాగు భూములుగా కూడా జాగిరిదార్ ప్రభుత్వంకు రాత పూర్వకంగా ఇచ్చిన ట్రిబ్యునల్ తీర్పు రైతులకు అనుకూలంగా వచ్చినా నాలుగు దశాబ్దాలుగా రైతులను జాగిరిదార్ వారసులు లిటిగేషన్ల పేరుతో రైతులను వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. సింగరాయపాలెం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సింగరాయపాలెం ఎంపిటిసి అనుమోలు కృష్ణార్జునరావు, పోట్ల శ్రీనివాసరావు, దొడ్డపనేని కృష్ణార్జునరావు, ఏలూరి శ్రీనివాసరావు, రోషన్ బేగ్, ఖాసిం బేగ్, వెంకటేశ్వర్లు, కట్టా రాంబాబు వందలాదిమంది రైతులు పాల్గొన్నారు.