Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
జాతీయ స్థాయి 'కరాటే' పోటీల్లో హార్వెస్ట్ పాఠశాల విద్యార్థిని లాస్య బంగారు పతకంను అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతిరెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 26వ తేదీన వరంగల్‌లో సుమన్ సుటోఖాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఇండియా వారు నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో తమ విద్యార్థిని వేల్పుల లాస్య విశేషంగా రాణించి రెండు బంగారు పతకాలు సాధించినట్లు ' తెలిపారు. తమ పాఠశాల 8వ తరగతి విద్యార్థి వేల్పుల లాస్య అత్యంత ప్రతిభను కనబరచి కటా విభాగంలో గోల్డ్ మెడల్ అలాగే కుముటి విభాగంలో సిల్వర్ పతకాన్ని సాధించడం గర్వకారణమన్నారు. అలాగే అతి పిన్న వయసులోనే బ్లాక్‌బెల్ట్ సాధించడమే కాకుండా బ్లాక్ బెల్ట్'లో 'సెకండ్ డాన్‌కు అర్హత సాధించి సర్టిఫికెట్‌ను తీసుకోవడం జరిగిందని తెలిపారు. విద్యార్థిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని, అలాగే శిక్షణ ఇచ్చిన శిక్షకులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.