Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీతి మృతికి సంతాపంగా టీఎస్ యూటీఎఫ్ కొవ్వొత్తులతో ర్యాలీ
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ధరావత్ ప్రీతి మృతిపై విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ( టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని యుటియఫ్ భవన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షులు జీవీ.నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన నిరసన ప్రదర్శననుద్దేశించి దుర్గాభవాని మాట్లాడుతూ రాష్ట్రంలో అమ్మాయిలపై దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయని, వీటిని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆమె అన్నారు. రాష్ట్రంలోని అమ్మాయిలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రీతి, రక్షితల మరణాలపై విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆమె ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి బండి నరసింహారావు, జిల్లా నాయకులు బుర్రి వెంకన్న, షమీ, వల్లకొండ రాంబాబు, షేక్ రంజాన్, షేక్ ఉద్దండ్ షరీఫ్, పి.సురేష్, అనురాధ, సద్దా బాబు, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, కేశ్యా, సతీష్ పాల్గొన్నారు.