Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరాటౌన్
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మార్చి1, 2, 3వ తేదీలలో అంగన్వాడీల సమ్మెను జయప్రదం చేయాలని పల్లిపాడు అంగన్వాడీల సర్కిల్ మీటింగులో ఐ.సి.డి.ఎస్ సిడిపిఓ సరస్వతికి మంగళవారం సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కనీస వేతనం 21000 ఇవ్వాలని, ఐసిడిఎస్కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేసే నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని, 2017 నుంచి ఉన్న టిఏ, డిఏ బకాయిలు చెల్లించాలని, అంగన్వాడీ కుటుంబాలకు ప్రభుత్వ పథకాలైన ఆసరా, కళ్యాణ లక్ష్మి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి మార్చి 1వ తేదీన ప్రాజెక్టుల ముందు ధర్నా కార్యక్రమం, 2, 3తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలలో ఆయాలు, టీచర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు సువార్త, అప్పమ్మ, లక్ష్మి, ముంతాజ్, మమత, శారద, వాసవి, సుశీల, శాంతి కుమారి, అరుణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.