Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపాలెం
మండల పరిధిలోని కామంచికల్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ సర్కిల్ ఇన్స్పెక్టర్కు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ఎస్.నవీన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజా రవాణా సౌకర్యం లేక ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు నిత్యం ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ దారిలో బస్ సౌకర్యం కల్పించడం వలన ప్రత్యేక్షంగా 10 ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించవచ్చన్నారు. కామంచికల్, జాన్ బాద్ తండా, పడమటి తండా, దారేడు, రామన్నపేట, దానవాయిగూడెం తదితర గ్రామాల నుండి ప్రతిరోజు రోజువారి పనుల కోసం కూలి పనులు నిమిత్తం ఖమ్మం నగరానికి వందలాది మంది వస్తున్నారని, వారందరికీ సరైన రవాణా సౌకర్యం లేనందున తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో జిల్లా మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యేలు బస్సును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారని వారు గుర్తు చేశారు. తక్షణమే కామంచికల్ ఏరియాకు బస్సును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని యడల భవిష్యత్తులో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శి అనంతినేని వీరయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు జిల్లా ఉపేందర్, ఎస్ఏఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టి.ప్రవీణ్, నాయకులు గండు లక్ష్మినారాయణ, చెరుకూరి మురళికృష్ణ, హన్మంతు శేషగిరి తదితరులు పాల్గొన్నారు.