Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ మొగిలి స్నేహాలత
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
ప్రాథమిక విద్యా ప్రమాణాల మెరుగుదలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొగిలి స్నేహలత అన్నారు. మండల పరిధిలోని చిన్న వెంకటగిరి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం తొలిమెట్టు అమలుపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా స్నేహాలత మాట్లాడారు. ప్రభుత్వం ప్రాథమిక విద్యాప్రమాణాలు మెరుగుపర్చడం, విద్యార్థులకు చదవడం రాయడం సులభతరం చేసేలా తొలిమెట్టు కార్యక్రమం చేపట్టి అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి మాసం విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి, ఫలితాల ఆధారంగా బోధన చేపట్టాలన్నారు.ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యాసంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం ''సైన్స్‌డే'' ను పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెర్ను ప్రారంభించి తిలకించారు. కార్యక్రమంలో డీఈవో సోమశేఖరశర్మ, ఎంపీడీవో అశోక్ కుమార్, ఎంపీవో శ్రీనివాసరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.