Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
లక్ష్మీదేవిపల్లి, కృష్ణవేణి జూనియర్ కళాశాలలో మంగళవారం స్టూడెండ్స్ మోటివేషనల్ ఓరియంటేషన్ ప్రోగ్రాం' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణవేణి కాలేజీ పూర్వవిద్యార్థులైన 'సీతారామం' సినిమా ఫేమ్ ఫిల్మ్ డైరెక్టర్ హను రాఘవపూడి, ఇల్లందు ఎమ్మెల్యే బి.హరిప్రియలు, ఛాయాగ్రాహకుడు యువరాజ్, నటుడు శత్రు, సైకాలజిస్ట్ శ్రీనాథాచారి, కృష్ణవేణి కళాశాల డైరెక్టర్స్ మాచవరపు కోటేశ్వరరావు, గొల్లపూడి జగదీష్, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హను రాఘవపూడి మాట్లాడుతూ కృష్ణవేణి కళాశాల పూర్వవిద్యార్థిగా కళాశాలతో తనకున్న అనుబంధాన్ని విద్యార్థులకు వివరించారు. తన చిన్ననాటి మధురజ్ఞాపకాలను, స్నేహితులను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులడిగిన వివిధ ప్రశ్నలకు ఓర్పుతో సమాధానాలు తెలిపారు.'పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే, ప్రతి విద్యార్థి ఏ రంగంలోనైనా తప్పక రాణించవచ్చునని, అందుకు తానే నిదర్శనమన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే బి.హరిప్రియ మాట్లాడుతూ కృష్ణవేణి కళాశాల పూర్వ విద్యార్ధిగా గర్విస్తున్నానని, విద్యార్థులందరూ మంచి మార్గంలో పయనిస్తూ, ఉన్నత స్థితికి ఎదగాలని' ఆకాంక్షించారు. కళాశాల డైరెక్టర్ మాచవరపు కోటేశ్వరరావు మాట్లాడుతూ 'విద్యార్థులందరూ చక్కగా చదువుకొని ప్రయోజకులై, వివిధ రంగాలలో రాణించాలన్నారు. 'కళాశాల పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలు తనకు ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తున్నాయని, విద్యార్థులందరూ 'పూర్వవిద్యా ర్థులను ఆదర్శంగా తీసుకొని, చక్కగా చదువుకొని ఉన్నతస్థితికి ఎదగాలని' ఆకాంక్షించారు. 'తల్లితండ్రుల ప్రేమను, వారి శ్రమను ఎల్లప్పుడూ గుర్తించుకొని ప్రవర్తించేవారు.
ప్రముఖ మోటివేటర్ శ్రీనాథాచారి మాట్లాడుతూ 'విద్యార్థులకు ఏదైనా సాధించాలనే కోరిక మాత్రమే సరిపోదని, అందుకు తగిన పరిశ్రమ చాలా అవసరమని, ఆలోచనా శక్తితో, కృషితో, పట్టుదలతో శ్రమించి, విద్యార్థులు విజయ తీరాలను చేరాలని' మోటివేట్ చేశారు.