Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రీ టౌన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
- సీపీఐ(ఎం) జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు
నవ తెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థానిక త్రీ టౌన్ ప్రాంతంలోని నూతన గోళ్లపాడు కెనాల్‌పై నిర్మించిన సుందరయ్య నగర్ పార్కులో కమ్యూనిటీ హాల్, గ్రంథాలయాన్ని నిర్మించాలని, త్రీ టౌన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి సిపిఎం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక 30వ డివిజన్లో బెజవాడ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ. సుందరయ్య నగర్ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకు గ్రంథాలయం లేక జ్ఞానాన్ని పెంపొందించుకోలేకపోతున్నారు అలాగే ఇక్కడ అంతా పేద వర్గాలు ఉన్నారు కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాలని ఆయన కోరారు. త్రీ టౌన్లో అన్ని డివిజన్లో కుక్కల బెడద, దోమల బెడద, పందుల బెడద ఎక్కువగా ఉందన్నారు. వీటన్నింటిని నివారించాలన్నారు. అలాగే దోమల ఫాగింగ్ మిషన్ ఇదివరకు అన్ని డివిజన్లో తిరిగేదని, ఇప్పుడు ఏ డివిజన్‌కి దోమల మందు ఫాగింగ్ మిషన్ రావడం లేదన్నారు. సమావేశంలో పార్టీ త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాస్ రావు, సిపిఎం త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ హిమాం, సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ నాయకులు రంగు హనుమంతచారి, మద్ది శ్రీను, వనమాల కృష్ణ, ఉడుగుల పద్మ, ఎర్ర లింగమ్మ, తదితరులు పాల్గొన్నారు.