Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయమ్మ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం : రేగా
- నివాళులర్పించిన జెడ్పీటీసీ, సర్పంచ్
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని నాగినేని ప్రోలు రెడ్డి పాలెం గ్రామంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న సవలం విజయమ్మ (45) గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం గుండెపోటు గురైన విజయమ్మను భద్రాచలంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు వైద్యులు ఆమెకు వైద్య చికిత్స అందిస్తుండగానే ఆమె మృతి చెందారు. కాగా మృతురాలిది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, రంప చోడవరం నియోజకవర్గం పరిధిలోని కూనవరం మండలం, పల్లూరు గ్రామం.కాగా రెడ్డి పాలెం గ్రామంలో అందరితో మంచిగా వుండే విజయమ్మ మృతి చెందిన విషయంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విజయమ్మ భౌతికకాయానికి నివాళులర్పించిన జెడ్పీటీసీ
మృతి విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత విజయమ్మ స్వగ్రామానికి వెళ్లి ఆమె భౌతికాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదే విధంగా రెడ్డిపాలెం సర్పంచ్ భూక్యా శ్రావణి, ఉపసర్పంచ్ ఎడమకంటి ఝాన్సీతదితరులు నివాళులు అర్పించారు.
ఏఎన్ఎం కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం: ప్రభుత్వ విప్ రేగా
ఏఎన్ఎం విజయమ్మ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని విప్, ఎమ్మెల్యే రేగా పేర్కొన్నారు. విజయమ్మ భౌతిక కాయానికి మండల బీఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి యడమకంటి సుధాకర రెడ్డి నివాళి అర్పించారు. అనంతరం ఫోన్ ద్వారా విజయమ్మ కుటుంబ సభ్యులను రేగా పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపాలెం బిఆర్ఎస్ గ్రామ యువజన శాఖ అధ్యక్షులు రామిరెడ్డి, రెడ్డిపాలెం బీఆర్ఎస్ గ్రామ కమిటీ సభ్యులు రోహిత్, ప్రవీణ్, ప్రభు, లోకిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గౌరీ, బిక్షు, తదితరులు పాల్గొన్నారు.