Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజలు నమ్మకంతో ఎన్నుకున్న నాయకులు అభివృద్ధి చేసి చూపించాలని, అప్పుడే ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాతరని, కొత్తగూడెం నియోజక వర్గం అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని పలువార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వనమా మాట్లాడారు. కేసీఆర్ సహకారంతో నియోజక వర్గం అభివృద్దిలో దూసుకు పోతుందని తెలిపారు. నియోజక వర్గం రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. పట్టణంలోని ఉర్ధూఘర్ మరమత్తులకు రూ.30 లక్షలు, రూ.20 లక్షలతో గొల్లగూడెంలోని వైకుంఠధామం పనులకు ఎమ్మెల్యే శంఖుస్థాపన చేశారు. పట్టణంలో, పల్లెల్లో సుందరీకరణ పెరింగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు పేద ప్రజలకు నేరుగా చేరుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ కాపు సీతాలక్ష్మీ, వివిధ వార్డు కౌన్సిలర్స్, తదితరులు పాల్గొన్నారు.