Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుజాతనగర్
మండల పరిధిలోని ధన్వంతరి కళాశాలలో (సెక్యూరేటిస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) సెబి ఆధ్వర్యంలో మంగళవారం సెమినార్ నిర్వహించారు. సెమి నార్కు ముఖ్యఅతిథిగా సెక్యూరి టీస్ మార్కెటింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ బి.విష్ణు కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పొదుపు, వాటా లలో పెట్టుబడి అలవాటును యువతలో పెంపొందించడానికి భారత ప్రభుత్వ నియంతృత్వ సంస్థ సెబీని ప్రవేశపెట్టిందని అన్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఎలా పెట్టాలి దాని వలన కలిగే లాభాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎంబీఏ ఎస్.రామ కోటేశ్వరరావు, ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ జి.నాగరాజు, ఫ్యాకల్టీ శ్రీనివాస్, మౌనిక, జ్యోత్స్న, ప్రకాష్ పాల్గొన్నారు.