Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- (హెచ్-142) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.రామారావు
నవతెలంగాణ-పాల్వంచ
కుక్కలు, పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్-142) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.రామారావు ఆధ్వర్యంలో మంగళవారం పాల్వంచ మునిసిపల్ కమిషనర్ చింత శ్రీకాంత్‌ని కలిసి వినతి పత్రం అందజేశారు. కేటీపీయస్, బి, ఐఎం, ఏ కాలనీలలో వందల సంఖ్యలో కుక్కలు, పందులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ కాలనీలో వాసుల మీద దాడి చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తునాయని, అలాగే చిన్న పిల్లలు సాయంత్రం వేళలలో కనీసం అరుబయటకి వచ్చి ఆటలు ఆడుకోవాలన్న కుక్కలు దాడి చేస్తాయేమో అన్న భయంతో బయటకు రావటని కూడా భయపడుతున్నారని తెలిపారు. అలాగే కేటీపీయస్ కాలనీలలో నివాస ప్రాంతాలలో ఖాళీ స్థలాలలో కొన్ని పార్కులను ఏర్పాటు చేసి అలాగే ప్రతిరోజు వ్యాయామం చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉపయోగపడే విధంగా వాకింగ్ ట్రాక్స్ ఎర్పాటు చేసేవిధంగా చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంపటి వెంకటేశ్వర్లు, యరగడ్డ ప్రసాద్, టి.గోపయ్య, పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.