Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్యచారి
నవతెలంగాణ-మణుగూరు
పొత్తులు ఉన్నా లేకున్నా పినపాక నియోజకవర్గంలో సీపీఐ ఒంటరిగా నైనాపోటీ చేస్తుందని, దీనికి గ్రామాల్లో బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.అయోధ్య పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మండల పట్టణ కౌన్సిల్ సమావేశానికి ఎంపీటీసీ కామ్రేడ్ కామిశెట్టి రామారావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం అభివృద్ధికి సీపీఐ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలు కృషి చేసారని అన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అభివద్ధి పనులు లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. మార్చి మూడో తేదీ నుండి మణుగూరు మండలం, మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో నెలకొన్నటువంటి సమస్యలపై సిపిఐ పార్టీ గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి, తెలుసుకొని, పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సమయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గం కార్యదర్శి పుల్లారెడ్డి, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి మోహన్ రావు, గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు కుటుంబరావు, తదితరులు పాల్గొన్నారు.