Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ఏరియాలోని జీఎం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉద్యోగ విరమణ మహౌత్సవమునకు అతిథిగా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఉద్యోగ విరమణ చేస్తున్న నందిగామ శ్రీనివాస్ రావు, కనకవల్లి గురించి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి సంస్థ నందు వివిధ హౌదాలలో సుదీర్ఘ సేవలందించి తోటి అధికారుల, ఉద్యోగుల మన్ననలు పొందారని, తమకు కేటాయించిన పనులను ఎంతో చిత్తశుద్ధితో, నిజాయితీతో నిర్వహించారని, తమ శేష జీవితం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, తమ సేవల గురించి కొనియాడారు. తదుపరి వారికి శాలువా, పూలమాలతో జ్ఞాపకను బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో యస్వోటు జీఎం మల్లారపు మల్లయ్య, అధికారుల సంఘం అధ్యక్షులు పి.శ్రీనివాసు, ఏజీఎం (ఈఅండ్ఎం) జి.ప్రభాకర రావు, ఏజీఎం(ఐఈ) గిరిధరరావు, డిజిఎం(ఫైనాన్స్) రామచంద్ర, ఏరియా సర్వే అధికారి బాలాజీ నాయుడు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్సాయి స్వరూప్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.