Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ కార్యాలయం ఎదుట నర్సరీ యజమాని దంపతుల నిరసన
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల పరిధిలోని మోరంపల్లి బంజర గ్రామంలో భద్రాద్రి నర్సరీ నిర్వహిస్తున్న యజమాని నారపరెడ్డి దంపతులు తమకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వటం లేదని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం ఈ మేరకు దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వండి.. అంటూ ఈ దంపతులు ఆయా పంచాయతీ కార్యాలయాల ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నారపరెడ్డి మాట్లాడుతూ లక్ష్మీపురం, నకిరిపేట, ముసలమడుగు, అంజనాపురం, ఇరవెండి, ఉప్పుసాక పంచాయతీల సర్పంచులు, సెక్రటరీలు పంచాయతీలో వేసేందుకు సంవత్సరం క్రితం మొక్కలు తీసుకున్నారని ఆయన అన్నారు. మొక్కలు తీసుకునే టప్పుడు నెల రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పారని ఆయన పేర్కొన్నారు. మొక్కలు తీసుకొని వెళ్లారని, ఎప్పుడు అడిగినా రేపు ఇస్తాం అనే సమాధానం చెబుతున్నారని, కొంతమంది సర్పంచ్లు, సెక్రటరీలు ఫోన్లు కూడా ఎత్తటం మానేశారని ఆయన అన్నారు. ఆరు పంచాయతీల నుంచి రూ.4 లక్షల 30 వేలు తానకు రావాలని, అదేవిధంగా కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వేరే పంచాయతీలకు కూడా మొక్కలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రూ.22 లక్షల రావాలని, ఏ పంచాయతీ వాళ్ళు కూడా సంవత్సరం నుంచి డబ్బులు ఇవ్వడం లేదని, 22 లక్షలు 1.50 వడ్డీకి తెచ్చి మొక్కలు తీసుకున్న వద్ద జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. దీంతో నెలకి రూ.35,000 వడ్డీలే కట్టడం జరుగుతుందని, సర్పంచ్లు, కార్యదర్శులు ఎవరూ స్పందించడం లేదని ఆయన అన్నారు. ఇకనైనా తమకు చెల్లించాల్సిన డబ్బులను జిల్లా ఉన్నత అధికారులు స్పందించి చెల్లించాలని ఆయన పేర్కొన్నారు.