Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా
నవతెలంగాణ-కొత్తగూడెం
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా డిమాండ్ చేశారు. స్థానిక శేషగిరిభవన్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ పరిధిలో సుమారు ఆరు వేల మంది ఇండ్లు లేని పేదలు ఉన్నారని, పలుమాలర్లు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు స్క్రీనింగ్ పేరుతో దరఖాస్తులను బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. ఇండ్ల నిర్మాణం పూర్తికాన్నప్పటికీ హడావుడిగా సర్వేలు నిర్వహించి అర్హల జాబితాను సిద్ధం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. కేవలం 684 మందిని మాత్రమే లాటరీ పద్దతిలో లబ్దిదారులను ఎంపిక చేసిన మిగిలిన అర్హలను నిరాశకు గురిచేశారన్నారు.