Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
కేంద్ర ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం గృహ అవసరాల సిలిండర్ ధరను రూ.50, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.350 భారీగా పెంచి సామాన్యుడు నడ్డి విరుస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్ ధర నేడు రూ.1200లకు చేరిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రజల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే మాదిరిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ రెండు రోజులపాటు పార్టీ శ్రేణులు అందరూ జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాలు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సొసైటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, మండల అధ్యక్షులు, చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘం నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు హాజరుకావాలని ఆయన కోరారు.