Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాయింట్ యాక్షన్ కమిటీ
- కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో 6వ రోజు విద్యుత్ ఉద్యోగుల నిరసన
నవతెలంగాణ-పాల్వంచ
జెన్కో యజమాన్యం సమస్యల పరిష్కారానికి స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు హెచ్చరించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు పిఆర్సి 2022, 1999, 2004 బ్యాచ్ ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సౌకర్యం ఇతర ఆర్టిజన్ సమస్యలు పరిష్కారం కోరుతూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనలతో భాగంగా గురువారం 6వ రోజు కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ కాంప్లెక్స్‌లో ఏడవ, ఐదు, ఆరవ దశలో నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ యాజమాన్యం ఇంకా పిఆర్సిని తేల్చడం లేదని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ ఏడవ దశ చీఫ్ ఇంజనీరింగ్ వెంకటేశ్వరరావు, జేఏసీ నాయకులు మంగీలాల్, సుధీర్, మజీద్, మహేష్, సీతారామరెడ్డి, రాధాకృష్ణ, నరసింహారావు, నాగేశ్వరరావు, రవీందర్, కోటేశ్వరరావు, ప్రభాకర్ రావు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : విద్యుత్ ఉద్యోగుల దశల వారి ఆందోళనలు కొనసాగుతున్నాయని గురువారం బీటీపీఎస్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన ధర్నా నిర్వహించామని, జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 6వ రోజు సమ్మెలో భాగంగా జరిగిన కార్యక్రమాలు పాల్గొని మాట్లాడుతూ పిఆర్సి అమలు చేయాలని, విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న దశల వారి ఆందోళనలు కొనసాగుతాయని అన్నారు. విద్యుత్ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించాలని ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా శుక్ర, శనివారాల్లో కూడా ధర్నాలు ఉంటాయని వివరించాడు. ఆందోళనలను మరింత విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వి.ప్రసాద్, రవి ప్రసాద్, బి.సత్యనారాయణ, కె.ప్రేమ్ కుమార్, వీరస్వామి, అసోసియేషన్ నాయకులు రాజబాబు, రవితేజ తదితరులు పాల్గొన్నారు.