Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
నవతెలంగాణ-బూర్గంపాడు
మేలైన పశు యాజమాన్య పద్ధతులను పాటించాలని జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. ఐటీసీ సహకారంతో బైపు సంస్థ ఆధ్వ ర్యంలో మోరంపల్లి బంజర్ గ్రామం లో గురువారం మేలు జాతి దూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పశువులకు కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన 50 మేలు జాతి దూడలు గేదలు, ఆవులను ప్రదర్శించి పాడి పోషణ కృత్రిమ గర్భధారం ద్వారా కలిగే లాభాలు మేలైన పశు యాజమాన్య పద్ధతులు పశుగ్రాసాల పెంపకం వ్యాక్సినేషన్ పై పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ పశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు వేయించడం ద్వారా పాడి రైతుల ఇంటి వద్దనే మేలు జాతి దూడలు, అధిక పాల ఉత్పత్తి పొందవచ్చునని ఆమె తెలిపారు. అనం తరం ఐటిసి ప్రోగ్రాం అధికారి సర్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఐటీసీ బంగారు భవిష్యత్తు ద్వారా చేస్తున్న కార్యక్రమాలను పాడి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మోరం పల్లి బంజర సర్పంచ్ భూక్య దివ్యశ్రీ, బైప్ సంస్థ ప్రతినిధి హేమంత్, సైదయ్య, వెంకట్రామి రెడ్డి, పాడి రైతులు పాల్గొన్నారు.