Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలోని వలస గొత్తికోయ గిరిజన గ్రామమైన మానగట్టు గ్రామంలో మండల అధికారుల బృందం గురువారం పర్యటించింది. కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారికి కావాలలసిన కనీస సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులు గ్రామంలో విద్యుత్ ఏర్పాటు, రహదారి సౌకర్యం, అంగన్వాడీ భవన నిర్మాణం, ఉపాధిహామీ పనుల ద్వారా చెరువు నిర్మాణం చేపట్టాలని అధికారులను కోరారు. విద్యుత్ లైన్ ఏర్పాటు కోసం 16 లక్షలు, రహదారి 3.3 కిమీటర్లకు 1 కోటి 10 లక్షలు, గ్రామంలో మూడు మంచినీటి బోర్లు ఏర్పాటుకు 1 లక్షా 44 వేల దీంతో పాటు ప్రాదమిక పాఠశాలకు కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, నూతన అంగన్వాడీ భవన నిర్మాణం ప్రహరీగోడల నిర్మాణం కోసం అంచనా వ్యయంతో ప్రతిపాదనలు కలెక్టర్‌కు పంపించనున్నట్లు ఎంపిడిఓ యం.చంద్రమౌళి తెలిపారు. వీటితో పాటు పాఠశాల ఆవరణలో గ్రామీణ క్రీడా ప్రాంగణం, అంగన్వాడీ కేంద్రంలో చదువుకునే చిన్న పిల్లల కోసం గ్రామపంచాయతీ నిధులతో రేకుల షెడ్ ఏర్పాటు, ప్రతి నెల మొదటి వారంలో హెల్త్ క్యాంపు, సోలార్ లైట్లు కోసం బ్యాటరీలు ఏర్పాటు, అర్హులైన వారికి అసరా ఫించన్లు మంజూరు వంటి చర్యలు తీసుకోనున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లకీë, ఎంపీఓ ముత్యాలరావు, పర్ణశాల వైద్యాధికారి రేణుకారెడ్డి, సీడీపీఓ సులోమి, పంచాయతీరాజ్ ఏఈ శ్రీరామ్, నీటిపారుదల శాఖ ఏఈ రాజ్ సుహాస్, విద్యుత్ శాఖ ఏఈ మోహన్‌రెడ్డి, ఎంఆర్పి ఏజె ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.