Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలువ రూ.39.లక్షలు
- ఐదుగురి పై కేసు నమోదు, వాహనం సీజ్
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని సారపాకలో బూర్గం పాడు పోలీసులు 196.7 కేజీల గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి రూ.39 లక్షల 34 వేల విలువ ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐదుగురి పై కేసు నమోదు చేసి, గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పాల్వంచ సీఐ ఎం.నాగరాజు పాత్రికేయులకు వివరించారు. బూర్గంపాడు మండల పరిదిలోని సారపాకలో ఎస్ఐ పి.సంతోష్ గురువారం వాహన తనీఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి పాల్వంచ వైపునకు వెళ్తున్న ఐషర్ వ్యాన్ పోలీసులను చూసి అపకుండా వెళ్తుండగా వెంబ డించిన పోలీసులు బీపీఎల్ స్కూల్ దగ్గర పట్టుకున్నారు. వ్యాన్‌ను తనిఖీ చేయగా ఒక ప్రత్యేక డబ్బా ఏర్పాటు చేసుకుని దానిలో పది బస్తాలలో ఈ గంజాయిని పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తులు మహరాష్ట్రలోని చాలిస్ గాన్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ ఫారూఖ్ అల్తాఫ్ షేక్, దూలే ప్రాంతానికి చెందిన క్లీనర్ షేక్ ఖలీల్‌గా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో వారిని విచారించగా అరకు ప్రాంతం నుంచి గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు. ఆజాద్ అనే వ్యక్తి అరుకు పారెస్ట్‌లో గురు అనే వ్యక్తి నుండి గంజాయి తీసుకుని నాందేడ్‌కు తరలిస్తే రూ.10వేలు చెల్లిస్తానని తెలపడంతో గంజాయి రవాణాకు పాల్పడినట్లు నిందితుల ద్వారా తెలుసుకున్నారు. వాహనాన్ని పోలీస్టేషన్‌కు తరలించి నలుగురు నిందితులతో పాటు లారీ యాజమాని సయ్యద్ ఖదీర్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆజాద్, గురు, ఖదీర్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ పి.సంతోష్, అదనపు ఎస్ఐ భూక్యా శీను పాల్గొన్నారు.