Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో 36 గంటల దీక్ష
- కదం తొక్కిన అంగన్వాడీలు, నినాదాలతో మారుమోగిన దీక్ష శిబిరం
నవతెలంగాణ-పాల్వంచ
కేంద్ర బడ్జెట్లో నిధులు కోత పెట్టి బీజేపీ ప్రభుత్వం ఐసీడీఎస్‌ను బలహీన పరిచేందుకు కుట్ర పండుతోందని, ఐసీడీఎస్ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిఘటించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి పిలుపునిచ్చారు. ఐసీడీఎస్ పరిరక్షణ, అంగన్వాడి హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్త అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో 36 గంటల దీక్ష, ధర్నాను కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో ప్రారంభించారు. ఈ ధర్నాకు జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు చీమల దండల కదిలి వచ్చారు. అంగన్వాడి నినాదాలతో కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ దద్దరిల్లింది. గ్రాడ్యుటీ చట్టం అమలు చేయాలని, ఐసీడీఎస్ బడ్జెట్ పెంచాలని, ఐసీడీఎస్ రక్షించాలని, పేద పేదలకు పోషక ఆహారాన్ని నాణ్యంగా అందించాలని, సమస్యలు పరిష్కారం చేయటం కోసం సమ్మెపై సిద్ధమే అంటూ నినాదాలతో ధర్నా చౌకు దద్దరిల్లింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని దీక్ష ధర్నాను ప్రారంభించిన యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.విజయలక్ష్మి అనంతరం మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేదలకు పోషక ఆహారాన్ని దూరం చేస్తుందని విమర్శించారు. నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో నిధులు కోత పెట్టి ఐసీడీఎస్‌ను ప్రైవేట్ సంస్థకు అప్పగించే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రక్తహీనత, శిశు మరణాల రేటును పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్స్ పాత్ర కీలకమైందని అన్నారు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు అంగన్వాడి సేవలను గుర్తించినా కానీ, మన కేంద్రాలను కేంద్ర ప్రభుత్వ మాత్రం మన శ్రమను గుర్తించడం లేదని విమర్శించారు. అంగన్వాడీల శ్రమదోపిడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని పోరాటాల ద్వారా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించటం ద్వారా మాత్రమే ఐసీడీఎస్ రక్షణ నిలుస్తుందని అన్నారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని నూతన విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య లక్ష్మి మెనూ చార్జీలు పెంచాలని మే నెల మొత్తం అంగన్వాడి కేంద్రాలకు వేసవి సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీల పోరాటానికి అండగా ఉంటాం : ప్రజాపంథా జిల్లా కార్యదిర్శి రంగయ్య
ఐసీడీఎస్ ద్వారానే పేదలకు పోషకాహారం అందుతుంది. ఐసీడీఎస్‌ను రక్షించుకోవడం కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలకు అండగా ఉంటాం. కలెక్టరేట్ ధర్నా వద్దకు వారి నాయకులతో వచ్చి మద్దతు తెలిపారు. కనీస వేతనాలు పెంచడంతోపాటు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి : ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం. జ్యోతి
మహిళలు తల్లులు పిల్లల కోసం శ్రమ చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. మహిళా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న పాలకులకు తగిన బుద్ధి చెప్పాలి. అనేక రంగాల పోరాటాలకు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేస్తున్న పోరాటాలు పూర్తిగా అండగా ఉంటాం.
ఈ ధర్నా కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ అధ్యక్షత వహించగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు కే.బ్రహ్మచారి, ఏజే.రమేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి జి.పద్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శలు కే.సత్య, డి.వీరన్న, పిట్టల అర్జున్, శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ రవికుమార్, పాయం రాధాకుమారి, యు.నరసింహ రావు, అంగన్వాడీ యూనియన్ ఆఫీస్ బెరర్ విజయశీల, వెంకటరమణ, పద్మ, కృష్ణవేణి, చుక్కమ్మ, మాధవి, రాధ, మరియ, వీరభద్రమ్మ, సూరమ్మ, అంజమ్మ, సావిత్రి, హేమలత, కళ్యాణి, పుల్లమ్మ, సారమ్మ తదితరులతో పాటు నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.