Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీఓ-22 అమలు చేయాలని, సింగరేణి యాజమాన్యం ఒప్పుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గురువారం సింగరేణి కార్పోరేట్ పరిధిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడారు. జీవో నెంబర్ 22, ఖాళీ కోటర్స్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులందరూ పాల్గొని సంతకాల సేకరణ చేశారు. వీలైనంత తొందరలో ఒప్పుకున్న డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ ఈనెల 6వ తేదీన హైదరాబాద్లో జరిగే ధర్నాలో అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సూరం ఐలయ్య, వీరన్న, శ్యామ్, శేఖర్, ప్రభాకర్, భాస్కర్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.