Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నబి
నవతెలంగాణ-ఇల్లందు
బీజేపీ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడం దారుణమని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నబి, ఆలేటి కిరణ్ అన్నారు. పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ రాజీవ్ నగర్ గుడిసెవాసుల నివాస ప్రాంతంలో మన్యం మోహన్ రావు అధ్యక్షతన గురువారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఏడు ఏండ్లలో రూ.600 ఉన్న గ్యాస్ ధర నేటితో రూ.1200 వరకు పెంచడం ప్రధాని మోడీ పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని విమర్శించారు. అదే విధంగా నిత్యవసర ధరలు డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచి పేద ప్రజల నడ్డి విరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల రేట్లు గాని ఉద్యోగస్తుల జీతాలు గాని పెంచకుండా కార్పొరేట్లకు లబ్ది కూర్చేందుకు పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు దారవత్ శంకర్, పాషా, సంతోష, గోబ్రియా, వెంకన్న, వైకుంఠం, కోటమ్మ, ఈశ్వర్, ఉపేందర్, అనూష తదితరులు పాల్గొన్నారు.
సుజాతనగర్ కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు వీర్ల రమేష్ డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలోని మెయిన్ సెంటర్ నందు గ్యాస్ బండతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్యాస్ ధర రూ.400 ఉంటే నేడు రూ.1200 అయినదని, పెట్రోల్ రూ.60 నుంచి 110 అయినదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియో గపరుస్తున్నాడని అన్నారు. ఇప్పటికైనా ఇటువంటి పనులు మానుకోకపోతే త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గండమల్ల భాస్కర్, వీర్ల ముత్తయ్య, నాగరాజు, మంచాల రాణి, శ్రీనివాస్, వినోద్, శివ తదితరులు పాల్గొన్నారు.