Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్
- పనులను వేగవంతం చేయాలని ఇంజనీర్లకు ఆదేశం
- పనులపై ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలి
నవతెలంగాణ-పాల్వంచ
మన ఊరు మనబడి పనుల్లో సగం సగం పనులు చేస్తే సహించేది లేదని నాణ్యత పాటించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశం హాల్లో మన ఊరు మనబడి కార్యక్రమాలపై విద్య ఇరిగేషన్ టీఎస్‌డబ్ల్యూ ఐడీసీ రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలో ఎంపిక చేసిన మన ఊరు మనబడి ద్వారా 87 పాఠశాలలో 415 పనులు చేపట్టామని, 20034 పనులు పూర్తికాగా, 145 పనులు పురోగతిలో ఉన్నాయని, 36 పనులు ప్రారంభించాల్సి ఉన్నట్లు చెప్పారు. మార్చి 25వ తేదీ నాటికి పూర్తి చేయాలని చెప్పారు. 20 రోజులు అత్యంత ప్రధానమని జరుగుతున్న పనులపై ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు ధృవీకరణ చేస్తేనే బిల్లులు మంజూరు చేస్తామని తెలిపారు. నిధులు చెల్లింపు ప్రక్రియ వేగంగా చేస్తున్నామని, ఇలాంటి జాప్యం లేదని, పనులు వేగవంతం చేయాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అధికారుల దేనిని ఆయనే స్పష్టం చేశారు. పచ్చదనం ఏర్పాటుతో పాఠశాలలు బ్రహ్మాండంగా తయారు కావాలని సూచించారు. పరమతులకు ముందు తదుపరి ఫోటోలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. సివిల్ పనులు పూర్తయి, రంగులు వేయడానికి సిద్ధంగా ఉన్న 34 పాఠశాలల్లో తక్షణమే రంగులు వేయాలని, మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసు జారీ చేయాలని, భవిష్యత్తులో ఎలాంటి పనులు చేపట్టకుండా బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలలు పరమత్తు పనులు ఛాలెంజ్‌గా తీసుకొని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని ఆయన స్పష్టం చేశారు. మండల వారీగా పాఠశాలల పనులు ప్రగతిని ప్రధానోపా ధ్యాయులను అడిగి తెలుసుకున్న వెనుకబడిన మండలాల్లో పనులు వేమంతం చేసేందుకు రోజువారి షెడ్యూల్ తయారు చేయాలని చెప్పారు. మన ఊరు మనబడి పాఠశాలలో మంచినీటి సరఫరా లేని పాఠశాలలు వివరాలు అందజేయాలని చెప్పారు. పాఠశాలలంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దే పాఠశాలలని, వాటిని అందంగా ముస్తాబు చేసేందుకు విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ఎంతో ప్రాధాన్యతతో కార్యక్రమం చేపట్టిందని ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఈ సమావేశంలో డీఈఓ సోమశేఖర్ శర్మ, ఇంజనీరింగ్ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.