Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హత కలిగిన లబ్దిదారులకు ఇండ్లు అందజేయాలి
- సీపీఐ(ఎం) కొత్తగూడెం టౌన్ కమిటీ డిమాండ్
- న్యాయం జరిగేలా చూడాలని ఆందోళన, పోలీసుల తోపులాట, అరెస్ట్
- ఇండ్లు పూర్తి కాకుండానే లబ్దిదారుల ఎంపిక ఎలా చేస్తారు..?
నవతెలంగాణ-కొత్తగూడెం
మున్సిపల్ వార్డు సభలు నిర్వహించకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులను ఎలా ఎంపిక చేస్తారని, అథారిటీ కమిటీలు వేయకుండా, వార్డుల వారీగా అర్హులైన లబ్ధిదారులను ఎలా గుర్తించారని సీపీఐ(ఎం) కొత్తగూడెం టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు ప్రశ్నించారు. గురువారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు చెందిన అబ్దిదారులనుఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఇది సరైన పద్దతి కాదని, వార్డు సభలు నిర్వహించాలని, లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తు సభ వేదిక వద్ద ప్లకార్డులు ధరించి నినాదాలు చేస్తు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే ఏకపక్షంగా తమ వర్గీయులకే డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపుచేశారని ఆరోపించారు. అర్హులైన పేద లందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, లాటరీ విధానం ఓ బూటకంమని మండి పడ్డారు. పాత కొత్తగూడెంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి కాకుండానే ఎలా లబ్దిదారుల ఎంపిక చేస్తారని, ఈ ప్రక్రియను నిలిపి వేయాలని నినాదాలు చేశారు. ఆందోళన కారులను పోలీ సులు అడ్డుకున్నారు. కొద్ది సేపు ఆందోళన కారులకు, పోలీసులకు మధ్య వాగ్వి వాదం, తోపులాట చోటుచేసు కుంది. బలవంతంగా ఆందోళన కారులను పోలీసులు సభ స్థలం నుండి ఈడ్చుకు వెళ్లారు. అదుపులోకి తీసుకుని వాహనాల్లో పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కొత్తగూడెం పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రవే ుష్, ఐద్వా టౌన్ కార్యదర్శి లక్ష్మీ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శికి బుర్ర వీర భద్రం, కొత్తగూడెం డివిజ న్ కార్యదర్శి నవీన్, పట్టణ కార్యదర్శి నాగకృష్ణ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే, అధికారులను నిలదీసిన సీపీఐ(ఎం)
పాల్వంచ : డబుల్ బెడ్ రూంల నిర్మాణమే పూర్తి కాకుండా, సమగ్ర సర్వే జరపకుండా లబ్దిదారుల ఎంపిక ఎలా చేస్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే.రమేష్, పట్టణ కార్యదర్శి రవికుమార్, పట్టణ కమిటీ సభ్యులు తులసి రామ్ ఎమ్మెల్యే, తహసీల్దార్, అధికారులను నిలదీ శారు. పాల్వంచలోని పాత ఆర్డిఓ కార్యాలయంలో డ్రా పద్ధతి ద్వారా డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక కార్య క్రమం వెంటనే నిలిపివేయాలని నిరసన తెలియజేశారు. తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తపరిచారు. వార్డుల వారీగా లబ్ధిదారుల లిస్ట్ ప్రకటించి స్థానికంగానే లాటరీ తీయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని బలవంతంగా వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాయకుల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ, నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పేదలు ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ పట్టణ కమిటీ సభ్యులు వాణి, రహీమ్, క్రాంతి, నాయకులు మాధవి, రెహమాన్ తదితరులు నాయకత్వం వహించారు.